హనుమకొండ చౌరస్తా, మార్చి 23: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2వ ఖేలో ఇండియా పారాగేమ్స్-2025లో 400 మీటర్ల అథ్లెటిక్స్ టీ-20 కేటగిరి ఈవెంట్లో దీప్తి (58.20) బంగారు పతకం సాధించింది. లాంగ్‌జంప్‌లో కనకప్ప టీ-44 కేటగిరీలో 5.30 మీటర్స్ డిస్టెన్స్తో కాంస్య పతకం గెలుపొందారు. ఆదివారం ఈ టోర్నీలో భారత్ రెండో స్వర్ణం సాధించింది. పది మీటర్ల షూటింగ్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన షూటర్ శ్రీధర్.. బంగారు పతకం సాధించాడు.పది మీటర్ల షూటింగ్ ఈవెంట్లో పావని కాంస్య పతకంతో మెరిసింది. పతక విజేతలు, కోచ్‌లు, మేనేజర్లను పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గడిపల్లి ప్రశాంత్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అసోసియేషన్ మెంబర్స్ అభినందించారు.