INDW vs SAW | సఫారీలను హడలెత్తించిన దీప్తి.. నాలుగో టీ20లో భారత్‌దే విజయం..!
INDW vs SAW : దక్షిణాఫ్రికా గడ్డపై పొట్టి సిరీస్‌లో భారత మహిళల జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. హ్యాట్రిక్ ఓటములతో ట్రోఫీ సమర్పించుకున్న టీమిండియా.. నాలుగో టీ20లో ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.
INDW vs SAW : దక్షిణాఫ్రికా గడ్డపై పొట్టి సిరీస్‌లో భారత మహిళల జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. హ్యాట్రిక్ ఓటములతో ట్రోఫీ సమర్పించుకున్న టీమిండియా.. నాలుగో టీ20లో ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. దీప్తి శర్మ(36 నాటౌట్, 5-19) ఆల్‌రౌండ్ షోకు జెమీమా రోడ్రిగ్స్(43) కీలక ఇన్నింగ్స్ తోడవ్వగా సఫారీలపై 14 పరుగుల తేడాతో గెలుపొంది పరువు కాపాడుకుంది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన వైట్‌వాష్ తప్పించుకుంది.
పొట్టి ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌లో భారత మహిళల జట్టు తొలి విజయంతో మురిసింది. దక్షిణాఫ్రికా గడ్డపై పొట్టి సిరీస్ కోల్పోయిన టీమిండియా ది వాండర్సే స్టేడియంలో పంజా విసిరింది. తొలుత జెమీమా రోడ్రిగ్స్(43), దీప్తి శర్మ(36 నాటౌట్), రీచా ఘోష్(34 నాటౌట్)ల మెరుపులతో భారీ స్కోర్ కొట్టిన టీమిండియా.. అనంతరం దక్షిణాఫ్రికాను 171కే కట్టడి చేసింది. బ్యాటుతో రాణించిన దీప్తి బంతితోనూ చెలరేగుతూ ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది.
Deepti Sharma’s FIVE of the very best 🖐️
Jemimah Rodrigues’ momentum-changing knock 🔥Together, they’re learning, evolving, focusing on the 𝗯𝗶𝗴𝗴𝗲𝗿 𝗽𝗶𝗰𝘁𝘂𝗿𝗲 👏🔝
🎥 Hear from the duo that helped deliver #TeamIndia‘s win in Johannesburg 🙌 – By @jigsactin #SAvIND |… pic.twitter.com/P3653EjjNE
— BCCI Women (@BCCIWomen) April 26, 2026
ఫామ్‌లో ఉన్న లారా వొల్వార్డ్త్(18)ను ఔట్ చేసి క్రాంతి గౌడ్ బ్రేకివ్వగా.. దీప్తి శర్మ తిప్పేయడంతో సఫారీ మిడిలార్డర్ పెవిలియన్ బాట పట్టింది. తంజిబ్ బ్రిట్స్(30) దూకుడుకు చరణి చెక్ పెట్టింది. డేంజరస్ సునే లుస్(40), అనెరీ డెర్క్సెన్(9), రెనెకే(21) అయబొగ ఖాకా(1), సెఖుఖునే(4)లను ఔట్ చేసిన దీప్తి తొలిసారి టీ20ల్లో ఐదు వికెట్లు పడగొట్టింది. దాంతో, 14 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ పరాజయాలకు ముగింపు పలికింది. ఇరుజట్ల మధ్య ఐదో మ్యాచ్ సోమవారం బెనోనిలోని విల్లోమూరే పార్క్‌లో జరుగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

