Deepti Sharma : భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక వికెట్లతో దీప్తి రికార్డు నెలకొల్పింది. త్రివేండ్రంలో శ్రీలంకతో జరిగిన ఐదో మ్యాచ్‌లో తను 152వ వికెట్ సాధించింది. నాలుగో మ్యాచ్‌కు ముందు 151 వికెట్లతో ఆస్ట్రేలియా పేసర్ మేఘన్ షట్(Meghan Shutt) రికార్డు సమం చేసిన దీప్తి.. నీలాక్షి డిసిల్వాను ఔట్ చేసి అగ్రస్థానికి దూసుకెళ్లింది. అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్ల జాబితాలో దీప్తి మూడో స్థానంలో కొనసాగుతోంది.
మూడు ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు భారత్‌కే చెందిన ఝులాన్ గోస్వామి(Jhulan Goswami) పేరిట ఉంది. ఈ మాజీ స్పీడ్‌స్టర్ 355 వికెట్లతో టాప్‌లో ఉండగా.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్యాథరీన్ సీవర్ బ్రంట్(Katherine Sciver-Brun) 335 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ 334 వికెట్లతో మూడు, ఎలీసా పెర్రీ 331 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫీ ఎకిల్‌స్టోన్ 323 వికెట్లతో ఐదో ర్యాంక్‌లో నిలిచింది.
Deepti Sharma stands tall as the leading wicket-taker in women’s T20Is 🔥 pic.twitter.com/Ig199OsR3n
— ICC (@ICC) December 30, 2025