INDW vs SLW : గువాహటిలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ఓపెనర్‌లో భారత బౌలర్లు వికెట్ల వేట మొదలెట్టారు. భారీ ఛేదనలో బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ శ్రీలంక స్కోర్‌బోర్డును ఉరికిస్తున్న చమరి ఆటపట్టు (43)ని వెనక్కి పంపారు. దీప్తి శర్మ సూపర్ డెలివరీతో డేంజరస్ బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో, రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.15 ఓవర్లకు స్కోర్.. 82-2. ఇంకా శ్రీలంక విజయానికి 189 రన్స్ కావాలి.
భారత్‌ను 269కు కట్టడి చేసిన శ్రీలంక ఛేదనను ధాటిగా ఆరంభించింది. కానీ, క్రాంతి గౌడ్ ఓపెనర్ హాసినీ పెరీరా(14)ను బౌల్డ్ చేసి మొదటి వికెట్ అందించింది. పెరీరా ఔటయ్యాక దూకుడు పెంచిన చమరి ఆటపట్టు (43) బౌండరీలతో చెలరేగింది. దీప్తి బౌలింగ్‌లో ఫోర్ సిక్సర్ బాది జోరు చూపించిన ఆమె అర్ధ శతకానికి చేరువైంది.
The joy of breakthrough! 😎
Crucial knock with the bat first and now a crucial wicket!
Deepti Sharma strikes ⚡️
Updates ▶️ https://t.co/m1N52FKm7l#TeamIndia | #WomenInBlue | #CWC25 pic.twitter.com/EmSv5tJ6YL
— BCCI Women (@BCCIWomen) September 30, 2025
కానీ, చివరకు దీప్తి ఓవర్లోనే తన వెనుదిరిగింది. 15వ ఓవర్ చివరి బంతికి పెద్ద షాట్ ఆడబోయిన ఆమె బంతిని మిస్ అయి క్లీన్‌బౌల్డ్ అయింది. దాంతో.. 82వద్ద లంక రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం హర్షిత సమరవిక్రమ(19), విష్మీ గుణరత్నే(0)లు లంకను ఆదుకునే పనిలో ఉన్నారు.