పర్వతగిరి, నవంబర్ 28: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జివాంజీ దీప్తి శుక్రవారం భారత్ యూత్ అవార్డు అందుకుంది.
భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించారు. దీప్తికి అవార్డు రావడంపై కుటుంబ సభ్యులు, కల్లెడ వాసులు హర్షం వ్యక్తం చేశారు.