Virat Kohli | నా తొలి భారత పర్యటనలో విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్
Virat Kohli | భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తొలి భారత పర్యటనలో విరాట్ కోహ్లీ తనపై ఉమ్మేశాడని ‘బాంటర్ విత్ బాయ్స్’ ఈ పోడ్ కాస్ట్లో ఎల్గర్ ఆరోపించాడు. ఆ తర్వాత రెండేళ్లకు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లీ తనకు క్షమాపణలు చెప్పాడని ఆయన వెల్లడించాడు.
Virat Kohli: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన తొలి భారత పర్యటనలో విరాట్ కోహ్లీ తనపై ఉమ్మేశాడని ‘బాంటర్ విత్ బాయ్స్’ ఈ పోడ్ కాస్ట్లో ఎల్గర్ ఆరోపించాడు. ఆ తర్వాత రెండేళ్లకు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లీ తనకు క్షమాపణలు చెప్పాడని ఆయన వెల్లడించాడు.
‘అది భారత్‌లో నా తొలి పర్యటన. తొలి టెస్టులో నేను బ్యాటింగ్‌కు వచ్చాను. విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడటం కూడా అదే తొలిసారి. అక్కడ పిచ్‌ను చూస్తే నాకు నవ్వొచ్చింది. ఆ వికెట్‌పై ఆడటం నాకు పెద్ద సవాలుగా మారింది. టర్నింగ్ వికెట్‌పై అశ్విన్, జడేజాను ఎదుర్కోవడం కష్టమైంది. అంతేగాక వాళ్లిద్దరూ నన్ను స్లెడ్జ్ చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే కోహ్లి నాపై ఉమ్మేశాడు. దాంతో ఓ అసభ్య పదం వాడి బ్యాట్‌తో కొడతానని చెప్పాను. నేను మాట్లాడిన భాష కోహ్లీకి అర్థమైంది. ఎందుకంటే అప్పటికే అతను ఐపీఎల్లో ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడు. నేను బూతు పదం వాడిన తర్వాత కోహ్లీ కూడా అదే పదంతో పదేపదే నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. దాంతో నేను అతని వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం మానేశా. మేం భారత్‌లో ఉన్నాం కాబట్టి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నా. విషయం తెలిసిన తర్వాత ఏబీ డివిలియర్స్ కూడా కోహ్లీని ప్రశ్నించాడు’ అని ఎల్గర్ పోడ్ కాస్ట్లో చెప్పాడు.
అదేవిధంగా.. ‘ఆ తర్వాత రెండేళ్లకు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లీ నాకు ఫోన్ చేశాడు. ‘ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇద్దరం కలిసి డ్రింక్ చేద్దామా..?’ అన్నాడు. ‘నేను ప్రవర్తించిన తీరుపట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా’ అని చెప్పాడు. నేను అందుకు అంగీకరించాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు ఇద్దరం డ్రింక్ చేస్తూనే ఉన్నాం’ అని ఎల్గర్ వెల్లడించాడు. కాగా, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డీన్ ఎల్గర్.. 2015 తొలిసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చాడు. అదే సిరీస్‌లో విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు జట్టుకు ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సరీస్లోనే కోహ్లీ తనపై ఉమ్మినట్లు ఎల్గర్ తెలిపాడు. ఆ తర్వాత 2017లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు తనకు క్షమాపణలు చెప్పాడని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

