T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton Dekock) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌పై సూపర్ 8 కీలక మ్యాచ్‌లో డికాక్ సిక్సర్లతో చెలరేగి.. 22 బంతుల్లోనే యాభై బాదేశాడు. దాంతో, ఈ మెగా టోర్నీలో వేగవంతమైన అర్ధ శతకం బాదిన రెండో క్రికెటర్‌గా సఫారీ ఓపెనర్ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు అమెరికా చిచ్చర పిడుగు అరోన్ జోన్స్(Aaron Jones) 22 బంతుల్లోనే 50 కొట్టేశాడు. డల్లాస్ వేదికగా కెనడాతో జరిగిన ఆరంభ పోరులో జోన్స్ ఈ ఘనత సాదించాడు.
తొమ్మిదో సీజన్లో డికాక్‌కు వేగవంతమైన అర్ధ శతకం బాదడం ఇది రెండోసారి. అమెరికాపై 26 బంతుల్లోనే యాభైకి చేరువైన డికాక్.. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ తన రికార్డును అధిగమించాడు. ఈ మెగా టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో ఎవరు ఉన్నారంటే.. ?
1. క్వింటాన్ డికాక్(దక్షిణాఫ్రికా) – ఇంగ్లండ్‌పై – 22 బంతుల్లో.
2. అరోన్ జోన్స్ (అమెరికా) – కెనడాపై 22 బంతుల్లో.
3. మార్కస్ స్టోయినిస్(ఆస్ట్రేలియా) – స్కాట్లాండ్పై – 25 బంతుల్లో.
4. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – అమెరికాపై – 26 బంతుల్లో.
5. సూర్యకుమార్ యాదవ్ (భారత్) – అఫ్గనిస్థాన్‌పై – 27 బంతుల్లో.