ఢిల్లీతో నువ్వానేనా అని పోరాడేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయింది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ ఐపీఎల్లో దాదాపు ప్రతి జట్టూ మంచు ప్రభావం కారణంగా టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ ఎంచుకోవడం చూస్తూనే ఉన్నాం.
తమ జట్టులో మనీష్ పాండేను పక్కనపెట్టేసి గౌతమ్‌ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఢిల్లీ జట్టులో మూడు మార్పులు జరిగినట్లు పంత్ వెల్లడించాడు. టిమ్ సేఫెర్ట్ స్థానంలో డేవిడ్ వార్నర్, మన్దీప్ స్థానంలో సర్ఫరాజ్, ఖలీల్ అహ్మద్ స్థానంలో నోర్ట్జీ ఆడుతారని వెల్లడించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఆన్రిచ్ నోర్ట్జీ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డీకాక్, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయి, ఆవేశ్ ఖాన్.
#LSG have won the toss and they will bowl first against #DelhiCapitals
Live – https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/zZu2ohQxvx
— IndianPremierLeague (@IPL) April 7, 2022