కోడ్ అడిగి.. కాల్స్ ‘ఫార్వర్డ్’ తో టోకరా వేసి..
మొబైల్ ఫోన్లో ఉండే కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ అమాయకులను దోచుకోవడానికి మోసగాళ్లకు ఉపయోగపడుతున్నది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) జారీ చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మోసగాళ్లు సాధారణ ప్రజలకు ఫోన్ చేసి, తాము కొరియర్ లేదా డెలివరీ సర్వీస్ ఏజెంట్లుగా చెప్పుకుంటున్నారు.
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లో ఉండే కాల్ ఫార్వర్డింగ్ ఫీచర్ అమాయకులను దోచుకోవడానికి మోసగాళ్లకు ఉపయోగపడుతున్నది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) జారీ చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మోసగాళ్లు సాధారణ ప్రజలకు ఫోన్ చేసి, తాము కొరియర్ లేదా డెలివరీ సర్వీస్ ఏజెంట్లుగా చెప్పుకుంటున్నారు. ప్యాకేజీని కన్ఫర్మ్ చేయాలని, లేదా రీషెడ్యూల్ చేయాలని సాకు చెప్తున్నారు. ఈ సంభాషణ సాధారణమైనదిగానే కనిపిస్తుంది. డెలివరీ విషయంలో ఓ చిన్న సమస్య వచ్చిందని, వివరాల ధ్రువీకరణ కోసం ఓ చిన్న కోడ్‌ను డయల్ చేయాలని చెప్తారు. ఈ కోడ్‌ను ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. ఈ కోడ్‌కు ముందు 21, 61 లేదా 67 ఉంటాయి. ఈ కోడ్‌ను డయల్ చేసినవారి ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఇన్ కమింగ్ కాల్స్‌ను ఆ మోసగాళ్ల నియంత్రణలో ఉన్న ఫోన్ నంబరుకు పంపిస్తుంది.
యూఎస్ఎస్డీ కాల్స్ దుర్వినియోగం
అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యూఎస్ఎస్డీ) అనే టెలికాం ప్రోటోకాల్ వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నెట్వర్క్ సర్వీసులను యాక్సెస్ చేయవచ్చు. దీనిని ఈ కుంభకోణానికి మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే వెరిఫికేషన్ కాల్స్, చెల్లింపుల కోసం వచ్చే కన్ఫర్మేషన్ ఓటీపీలు, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫాంల నుంచి వచ్చే ఆథెంటికేషన్ మెసేజ్‌లు యూజర్లకు కాకుండా మోసగాళ్లకు చేరుతాయి. గుర్తు తెలియని కాలర్లు పంపించే యూఎస్ఎస్డీ కోడ్స్ ప్రారంభంలో 21. 61 లేదా 67 ఉంటే, ఆ కోడ్లను డయల్ చేయవద్దు. కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేషన్లో ఉందని యూజర్లకు అనుమానం వస్తే, వెంటనే ##002# కు డయల్ చేసి అన్ని ఫార్వర్డింగ్ సర్వీసులను డీయాక్టివేట్ చేయాలి. బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫోన్ చేయాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

