కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. పృథ్వీ షా (51), వార్నర్ (38 నాటౌట్) అద్భుతమైన ఆరంభం అందించారు. ముఖ్యంగా షా అయితే ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతన్ని వరుణ్ చక్రవర్తి 9వ ఓవర్లో బుట్టలో వేసుకున్నాడు.
ఆ ఓవర్ నాలుగో బంతి తనకు దూరంగా టర్న్అవుతుందని షా అనుకున్నాడు. కానీ అది వికెట్లవైపు టర్న్ అవడంతో మిస్సయ్యాడు. ఆ బంతి వికెట్లను కూల్చడంతో 93 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనూహ్యంగా మూడో స్థానంలో రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ జట్టు 101/1 స్కోరుతో నిలిచింది.