DC vs KKR | మరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. 15 ఓవర్లకు స్కోరు ఎంతంటే?
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు కొంత పుంజుకున్నారు. ఆరంభంలో పృథ్వీ షా (51), డేవిడ్ వార్నర్ (59 నాటౌట్) అద్భుతంగా ఆడటంతో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఆ తర్వాత రిషభ్ పంత్ (27) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ తర్వాత పుంజుకున్న కోల్‌కతా బౌలర్లు పృథ్వీ షా, రిషభ్ పంత్, లలిత్ యాదవ్ (1)ను తక్కువ వ్యవధిలోనే వెనక్కు పంపి సత్తా చాటారు.
వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసుకున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అయితే 16వ ఓవర్ తొలి బంతికే రావ్‌మెన్ పావెల్ (8)ను కూడా నరైన్ అవుట్ చేసి ఢిల్లీకి షాకిచ్చాడు. ఢిల్లీ బ్యాటర్ల బ్యాటింగ్ చూస్తుంటే ఆ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపిస్తోంది. కానీ కోల్‌కతా బౌలర్లు కూడా వారిని కట్టడి చేయడంలో సఫలం అవుతున్నట్లే కనిపిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- DC vs KKR
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

