ఐపీఎల్లో శనివారం మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్, రిషభ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ సారధి పంత్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2022లో సాయంత్రం జరిగే మ్యాచులన్నింటిలో ఛేజింగ్ టీములే గెలిచిన సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు రాజస్థాన్ మాత్రమే.. సన్‌రైజర్స్‌పై లక్ష్యాన్ని కాపాడుకొని విజయం సాధించింది. మిగతా జట్లన్నీ ఛేజింగ్ చేసి గెలిచినవే. ఈ క్రమంలో టాస్ చాలా కీలకంగా మారింది. ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసినట్లు పంత్ తెలిపాడు. కమలేష్ నాగర్కోటి స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడనున్నాడు. గుజరాత్ జట్టులో ఎటువంటి మార్పులూ చేయలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, టిమ్ సేఫర్ట్, మన్దీప్ సింగ్, రిషభ్ పంత్, రోమెన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
గుజరాత్ టైటన్స్: శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, వరుణ్ ఆరోన్, లోకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ
Hello and welcome to the MCA Stadium, Pune. @DelhiCapitals have won the toss and they will bowl first against @gujarat_titans.#TATAIPL #GTvDC pic.twitter.com/IEnP4l6P1q
— IndianPremierLeague (@IPL) April 2, 2022