సిడ్నీ: టెస్టు కెరీర్లో ఆడిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 68/7తో శనివారం నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ 115 పరుగులకు ఆలౌటైంది. అయూబ్ (33) టాప్ స్కోరర్ కాగా.. కంగారూ బౌలర్లలో హజిల్‌వుడ్ 4, లియాన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది. వార్నర్‌తో పాటు లబుషేన్ (62 నాటౌట్) అర్ధశతకంతో రాణించాడు. పాక్ బౌలర్లలో సాజిద్ రెండు వికెట్లు పడగొట్టాడు. జమాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, కమిన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
తన సొంత మైదానం సిడ్నీలో చివరి టెస్టు ఆడిన వార్నర్‌కు అభిమానులు అనూహ్య రీతిలో వీడ్కోలు పలికారు. మ్యాచ్ ముగిసిన అనంతరం వేలాది మంది అభిమానులు వార్నర్‌ను అభినందించేందుకు మైదానంలోకి వచ్చారు. కెరీర్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.