David Warner : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) వయసు పైబడుతున్నా కొద్దీ కుర్రాడిలా రెచ్చిపోతున్నాడు. 39 ఏళ్లలోనూ తనలో చేవ తగ్గలేదని నిరూపిస్తూ తన బ్రాండ్ క్రికెట్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్.. ఫ్రాంచైజీ క్రికెట్లో సెంచరీలతో విరుచుకుపతున్నాడు. బిగ్‌బాష్ లీగ్‌లో విధ్వంసక శతకంతో రికార్డు నెలకొల్పాడు. పొట్టి ఫార్మాట్లో పదోసారి మూడంకెల స్కోర్ అందుకోవడంతో పాటు14 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడీ చిచ్చరపిడుగు.
ఫార్మాట్ ఏదైనా దూకుడే మంత్రంగా చెలరేగే డేవిడ్ వార్నర్ స్వదేశంలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సెంచరీలతో మెరుస్తున్నాడు. జనవరి 3వ తేదీన హోబర్డ్ హరికేన్స్ బౌలర్లను ఉతికేస్తూ 57 బంతుల్లోనే వంద కొట్టి.. 130 పరుగులతో అజేయంగా నిలిచాడీ మాజీ ప్లేయర్. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ టీ20ల్లో అతడికి 9వ సెంచరీ అది. తాజాగా సిడ్నీ సిక్సర్స్ బౌలర్ల భరతం పట్టిన అతడు.. 101 రన్స్‌తో జట్టును గెలిపించాడు. గత నాలుగు మ్యాచుల్లో వార్నర్ స్కోర్లు.. 110 నాటౌట్, 82, 67 నాటౌట్, 130 నాటౌట్.
A brilliant run from David Warner 🔥
The previous three innings came in losses – will this be a match-winning 💯? pic.twitter.com/ic15CpPKGl
— ESPNcricinfo (@ESPNcricinfo) January 16, 2026
పొట్టి ఫార్మాట్లో వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. సిడ్నీ సిక్సర్స్‌పై సెంచరీతో వీరవిహారం చేసిన అతడు అంతర్జాతీయ, ఫ్రాంచైజీ టీ20ల్లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ ఫీట్ నెలకొల్పిన నాలుగో బ్యాటర్‌గా అవతరిచాడతడు. వార్నర్ కంటే ముందు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, మాజీ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఈ మైలురాయికి చేరుకున్నారు. ప్రస్తుతం గేల్ 14,562 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. పొలార్డ్ 14,462 పరుగులతో, అలెక్స్ 14,449 రన్స్‌తో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. వార్నర్ 14,028 రన్స్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు.
39-year-old David Warner is now one of four 🙌 pic.twitter.com/6F1FCwKatn
— ESPNcricinfo (@ESPNcricinfo) January 16, 2026
రెండేళ్ల క్రితం సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు వార్నర్. అనంతరం భారత్‌లో వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొదాక వన్డేలకు వీడ్కోలు పలికేసిన డేవిడ్ భాయ్.. టీ20 వరల్డ్ కప్‌తో మూడు ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. తన సుదీర్ఘ కెరీర్లో బాదుడే పరమావధిగా అభిమానులను అలరించిన వార్నర్ పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు.
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా మరొక రికార్డు లిఖించాడీ లెఫ్ట్ హ్యాండర్. ఏకంగా భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు బద్దలు కొట్టాడీ ఆసీస్ స్టార్. ప్రస్తుతానికి వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. వార్నర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.