హైదరాబాద్ : సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు వార్తలను బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) తీవ్రంగా ఖండించారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ( Social Media ) లో తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే ప్రసారాలు కాకుండా తప్పుడు వార్తలతో రేటింగ్‌ను పెంచుకునే చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అసత్యపు వార్తలు ప్రసారం చేసే సంస్థలపై చట్టపరంగా చర్యలకు వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు.