టేకులపల్లి, జనవరి 16 : టేకులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు గుగులోత్ రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి రూ.6 లక్షల చెక్కును టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభకు జిల్లా కుటుంబ సంక్షేమ నిధి సొసైటీ కన్వీనర్ డి.దాసు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని హాజరై మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ సభ్యులకు రూ.3 కోట్లకు పైగా సంఘీభావ విరాళాలు అందజేయడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం ఆకస్మికంగా చనిపోయినా లేదా పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు రావాల్సిన ప్రభుత్వ సహాయం వెంటనే రాని సందర్భం ఉన్నదన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ 2023ను మంచి ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే ప్రకటించాలని, ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. పదవీ విరమణ చెందిన వారి బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, టీఎస్జిఎల్ఐ, జిఐఎస్ వంటివి గత రెండు సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నాయని వెంటనే జమ చేయాలని కోరారు.
నూతన విద్యా విధానం 2020ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలన్నారు. 2010 కి ముందు నియామకమైన వారిని ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుండి మినహయించాలని కోరారు. ఈ సంస్మరణ సభలో టేకులపల్లి ఎంఈఓ ఏ.జగన్, రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్షుడు బి.మురళీమోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లంపాటి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మి, ఎం,రాజయ్య, జిల్లా కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎఫ్ డబ్ల్యూ ఎస్ జాయింట్ సెక్రెటరీ ఎన్.కృష్ణ, జిల్లా కార్యదర్శులు హాథిరాం, పి.జయరాజు, ఎం.పద్మారాణి, ఎస్ కే పాషా, డి.తావూరియా, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.కిషోర్ సింగ్, టేకులపల్లి మండల బాధ్యులు డి.హరి, టి.లక్ష్మణ్, ఇల్లెందు మండల బాధ్యులు ఈ.రాంబాబు, కె.వెంకటేశ్వర్లు, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ బి.రామచందర్, జిల్లా సోషల్ మీడియా సభ్యుడు బి.మంగీలాల్, జిల్లా కమిటీ సభ్యులు ఏ.వీరన్న, గుండాల మండల బాధ్యుడు రూప్సింగ్, సభ్యులు భానుప్రియ, గుగులోత్ రమేశ్ పాల్గొన్నారు.