David Miller : బార్బడోస్ వేదికగా జూన్ 29న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. విజయానికి చేరువైన సమయంలో పట్టు సడలించి భారత జట్టుకు ట్రోఫీ అప్పగించిన సఫారీలు ఆ బాధతో గుండె పగిలినట్టుగా ఏడ్చేశారు. ఐసీసీ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరి.. మొదటి ట్రోఫీని ముద్దాడకుండానే ఇంటిదారి పట్టిన ఆ రోజును మర్చిపోలేనని ఆ జట్టు విధ్వంసక ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) ఇప్పటికే చెప్పాడు కూడా. తాజాగా మిల్లర్ ఆ ఫైనల్ ఓవర్‌ను గుర్తు చేసుకున్నాడు. ఆరోజు సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్‌తో అంతా తలకిందులు అయిందని చెప్పాడు.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో క్రికెట్ మంత్లీ షోలో మాట్లాడిన మిల్లర్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్ గురించి పలు విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన వల్లే దేశం తలదించుకోవాల్సి వచ్చిందని అతడు వాపోయాడు. ‘ఆ రోజును మాటల్లో వర్ణించలేను. వరల్డ్ కప్ ఓటమిని తలచుకుంటేనే పట్టలేనంత కోపం, చిరాకు, నిరాశ, వైఫల్యం.. ఇవన్నీ నన్ను చుట్టుముడుతాయి.
“It’s a bit cruel, but such is life” – David Miller on South Africa’s heartbreak, as they came agonisingly close to the ICC T20 World Cup 🏆 pic.twitter.com/8kFRghhQxQ
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2024
నేను ఇతర ఆటలు చాలా చూశాను. ఆయా ఆటగాళ్లు మ్యాచ్ గెలవాల్సిన క్షణం గురించే మాట్లాడుతారు. ఆరోజు నేను మా జట్టును గెలిపించాల్సింది. కానీ, నేను మా దేశం తలొగ్గేలా చేశాను. మా జట్టు సభ్యులను తలదించుకునేలా చేశాను. అందుకనే ఆరోజు క్యాచ్ అవుట్ అయినా సరే మైదానం వీడొద్దని అనుకున్నా’ అని మిల్లర్ తెలిపాడు.
తొమ్మిదో సీజన్లో మర్క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ‘చోకర్స్’ ముద్రను బద్ధలు కొడుతూ సెమీస్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టిచింది. అయతే.. తొలి ఐసీసీ ట్రోఫీ కొట్టేస్తుందనుకుంటే మళ్లీ ఒత్తిడితో కుదేలైంది. కింగ్స్టన్ ఓవల్‌లో జూన్ 29న భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో ఓడింది. టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్(52), డేవిడ్ మిల్లర్(21)ల మెరుపులతో పటిష్టస్థితిలో నిలిచిన సఫారీ జట్టు అనూహ్యంగా తడబడింది.
An excellent catch at a crucial stage!
What a grab from SKY 🔥
Follow The Match ▶️ https://t.co/c2CcFqY7Pa#TeamIndia | #T20WorldCup | #SAvIND | @surya_14kumar pic.twitter.com/9ZHwXKgfGB
— BCCI (@BCCI) June 29, 2024
ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మిల్లర్ భారీ షాట్ ఆడాడు. దాదాపు అది సిక్సర్ అనిపించింది. కానీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అంతే.. మిల్లర్ నిరాశగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. దాంతో, మర్క్రమ్ సేనకు మర్చిపోలేని ఓటమి ఖాయమైంది.