iPhones Discounts | ఆపిల్ ఐ-ఫోన్ అంటే ఎవరికైనా ఇష్టమే.. ఈ గ్లోబల్ టెక్ దిగ్గజం తయారు చేసే ఐ-ఫోన్లు భారీ ధరలతో వస్తుంటాయి. కానీ డిస్కౌంట్ ధరలపై అందుబాటులోకి వస్తే సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ప్రస్తుతం పండుగల సీజన్ సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఐ-ఫోన్లపై డిస్కౌంట్ ఎంత లభిస్తుందో తెలుసుకుందామా..
ఈ నెల తొమ్మిదో తేదీన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ సందర్భంగా ఐ-ఫోన్ 15 ధర భారీగా తగ్గించింది ఆపిల్. ఐ-ఫోన్ 16 ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.69,900 కాగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో రూ.54,999లకే అందుబాటులో ఉంది. దీనికి తోడు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.3,000, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2000 రాయితీ పొందొచ్చు. అంటే రూ.49,999లకే ఐ-ఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు.
ఆపిల్ ఐ-ఫోన్ 15 ప్రో ఫోన్ రూ.1,34,000 నుంచి రూ.99,999లకు దిగి వచ్చింది. ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ రూ.5000, ఎక్స్చేంజ్ బోనస్ రూ.5000 కలుపుకుని రూ.89,999లకు లభిస్తుంది. ఇక ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ లాంచింగ్ ధర రూ.1,59,900 నుంచి రూ.1,09,999లకు దిగి వచ్చింది.
మూడేండ్ల క్రితం ఆపిల్ ఐ-ఫోన్ 13 ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించారు. దీని లాంచింగ్ ధర రూ.59,600. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో రూ.41,999లకే ధర తగ్గించారు. ఎస్బీఐ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసే వారికి మరో రూ.2,000 డిస్కౌంట్ అందిస్తుంది. అంటే రూ.38,749లకే లభిస్తుందీ ఫోన్.
ప్రస్తుతం క్రోమాలో ఐ-ఫోన్ 13 ఫోన్ రూ.49,900లకు లభిస్తుంది. విజయ్ సేల్స్ కింద ఐ-ఫోన్ 13 ఫోన్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.48,900లకు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ సేల్ లో రూ.49,900 పలుకుతుంది. ఈ ధరలతో పోలిస్తే ఐ-ఫోన్ 13 ఫోన్ మీద అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది.