India Vs SA ODI | నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న దక్షిణాఫ్రికాను డేవిడ్ మిల్లర్ ఆదుకున్నాడు. డికాక్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మిల్లర్.. హెన్రిచ్ క్లాసిన్‌తో కలిసి జట్టు స్కోర్ పెంచుతూ వచ్చాడు. తొలి వన్డేలో 21 ఓవర్లు పూర్తయ్యేసరికి 110 పరుగులు చేసింది. కానీ తర్వాత డేవిడ్ మిల్లర్, క్లాసిన్ జోడీ నిలకడగా ఆడుతూ ముందుకు సాగింది. 36వ ఓవర్లో మిల్లర్, క్లాసిన్ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 36వ ఓవర్ చివరి బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా పెవిలియన్ దారి పట్టించి సిక్సర్ కొట్టాడు క్లాసిన్. 36 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఐదో వికెట్ భాగస్వామ్యానికి మిల్లర్, క్లాసిన్ జోడీ 97 పరుగులు జత చేసింది.
లక్నోలో సాగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నది. 23 ఓవర్లో రవి బిష్ణోయ్ వేసిన రెండో బంతిని ఆడబోయిన డికాక్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయారు. అప్పటికి జట్టు స్కోర్ 110 పరుగులు. అంతకుముందు దక్షిణాఫ్రికా 21 ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నది. నాలుగో వికెట్ కాపాడేందుకు డికాక్, క్లాసిన్ ప్రయత్నించారు. 54 బంతుల్లో 48 పరుగులు చేసిన డికాక్.. అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
సగం ఓవర్లు పూర్తయ్యే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత డికాక్.. క్రీజ్‌లో నిలకడగా ఆడుతున్నాడు. డికాక్ 40 పరుగులు, హెన్రిచ్ క్లాసిన్ 13 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అంతకుముందు టీం ఇండియా బౌలర్ కుల్దీప్ 16వ ఓవర్లో వేసిన చివరి బంతిని ఆడిన మక్రాం బౌల్డ్ అయ్యాడు. అప్పటికి సఫారీల స్కోర్ 74 పరుగులు మాత్రమే. దీంతో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.
అంతకుముందు 15వ ఓవర్లో సఫారీలు రెండో వికెట్ కోల్పోయారు. 15వ ఓవర్లో చివరి బంతిని వేసిన ఠాకూర్.. క్రీజ్‌లో ఉన్న బావుమాను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ 70 పరుగులు మాత్రమే. అంతకుముందు 13వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో ఠాకూర్ వేసిన తొలి బంతిని ఆడిన జన్నెమాన్ మలాన్ ఔటయ్యాడు. ఆ బంతిని శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో సఫారీలు తొలి వికెట్‌ను కోల్పోయారు. అప్పటికి జట్టు స్కోర్ 49 పరుగులు. అంతకుముందు టాస్ గెలుచుకున్న టీం ఇండియా బౌలింగ్ ఎంచుకున్నది.