సిడ్నీ: శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాలంలో యాప్ ద్వారా పరిచయమైన తనపై దనుష్క లైంగిక దాడి చేసినట్టు ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు న్యూసౌత్‌వేల్స్ పోలీసులు వెల్లడించారు. పొట్టి ప్రపంచకప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన దనుష్క.. ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. శనివారం ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక.. సెమీస్ అవకాశాలు కోల్పోవడంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. దనుష్క లేకుండానే జట్టు సభ్యులు స్వదేశానికి పయనమయ్యారు.