Danushka Gunathilaka | అత్యాచార కేసులో శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక (Danushka Gunathilaka)కు భారీ ఊరట లభించింది. గతేడాది టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) సమయంలో ఆస్ట్రేలియా మహిళపై దనుష్క అత్యాచారం (sexual assault) చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు అతడిని గతేడాది అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్పై బయటకు వచ్చాడు. ఈ కేసులో తాజాగా ఆస్ట్రేలియా కోర్టు (Australian Court) కీలక తీర్పు వెలువరించింది. అత్యాచారయత్న ఆరోపణలను కొట్టివేసింది. దీంతో అతడు ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు.
గుణతిలకకు కొంతకాలం క్రితం ఆన్లైన్లో 29 ఏళ్ల మహిళ పరిచయమైందని.. ఆ మహిళపై అతడు అత్యాచారానికి యత్నించాడని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు అతడిని గతేడాది నవంబర్లో సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో గుణతిలక తనను బలవంతం చేయబోయాడని, మద్దు పెట్టుకున్నట్లు సదరు మహిళ ఆరోపించింది. అయితే విచారణ సమయంలో మాత్రం రెండు విధాలుగా వాదనలు వినిపించింది. దీంతో ఈ కేసులో గుణతిలకకు అనుకూలంగా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
ఈ తీర్పుపై క్రికెటర్ సంతోషం వ్యక్తం చేశాడు. అన్నింటికీ తీర్పే సమాధానమని, ఇక నుంచి తన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా గడుపుతానని అన్నాడు. లంక తరఫున క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
Also Read..
Chennai | షాకింగ్.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు.. Video
Manipur Violence | మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. రంగంలోకి రాకేష్ బల్వాల్