బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో దబంగ్ ఢిల్లీ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 36-30తో యూ ముంబాపై గెలుపొందింది. ఢిల్లీ తరఫున విజయ్ మాలిక్ (12 పాయింట్లు), అషు మాలిక్ (8) రాణించారు. తాజా సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లాడి తొమ్మిది విజయాలు సాధించిన ఢిల్లీ 53 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు (46), పట్నా (45) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ ఒకే ఒక్క గెలుపుతో పట్టిక అట్టడుగున కొనసాగుతున్నది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 32-26తో హర్యానా స్టీలర్స్‌పై విజయం సాధించింది.