వైజాగ్: ప్రో కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ జట్టు బోణీ కొట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ.. 41-34తో బెంగళూరు బుల్స్‌ను ఓడించి టోర్నీలో శుభారంభం చేసింది. ఆట ఆధ్యంతం బెంగళూరుపై ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ.. తొలి అర్ధభాగంలోనే 21-11తో ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్ ఆరంభంలోనూ బెంగళూరు పుంజుకోలేక చతికిలపడింది. కానీ ఆట మరో పదినిమిషాల్లో ముగుస్తుందనగా ఆ జట్టు వరుస పాయింట్లు సాధించినా దబాంగ్ ఆధిక్యాన్ని తగ్గించిందే తప్ప ఢిల్లీ గెలుపును ఆపలేకపోయింది. ఢిల్లీ సారథి అషు మాలిక్ (15 పాయింట్లు) ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.