కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాతో పోటీపడిన భారత్.. ఏకంగా 11-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ విజయం ఇదే కావడం గమనార్హం.
భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతను హ్యాట్రిక్ సాధించడంతోపాటు మరో ఆటగాడు జుగ్రాజ్ సింగ్ రెండు గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. భారత జట్టు తర్వాతి మ్యాచ్‌లో పూల్-బి టాపర్ ఇంగ్లండ్‌తో తలపడనుంది.
GAME OVER! 🏑
⚠️ 𝙒𝙖𝙧𝙣𝙞𝙣𝙜: The #MenInBlue are here to WIN!IND 11:0 GHA #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @IndiaSports @sports_odisha @Media_S pic.twitter.com/Jsge9gx56A
— Hockey India (@TheHockeyIndia) July 31, 2022