మహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్, తెలంగాణ తేజం నిఖత్ జరీన్ మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పంచ్ విసిరింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో పోటీ పడిన ఆమె.. ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది.
ఫైనల్లో కార్లీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్ 5-0 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ నిఖత్ ఇదే స్కోరుతో గెలిచింది. ఆ ఒక్క మ్యాచ్‌ను అంపైర్ మరో రెండున్నర నిమిషాలు ఉండగా.. ఆపేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు.
ఇంతకుముందే మరో మహిళా బాక్సర్ నీతూ ఘంఘాస్ కూడా బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరు భారత మహిళలు ఒకే కామన్వెల్త్ ఎడిషన్‌లో స్వర్ణాలు సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
HAR PUNCH MEIN JEET! 🔥🔥🔥
Reigning World Champion @nikhat_zareen 🥊 dominates a tricky opponent Carly MC Naul (NIR) via UNANIMOUS DECISION and wins the coveted GOLD MEDAL 🥇 in the Women's 50kg event at #CWG2022
Extraordinary from our Champ 💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/4RBfXi2LQy
— SAI Media (@Media_SAI) August 7, 2022
The World Champion is now also the Commonwealth Games champion!🔥
Nikhat Zareen — Queen👑#CommonwealthGames | #Boxing pic.twitter.com/yPIHRjCz4A
— The Bridge (@the_bridge_in) August 7, 2022