కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు సత్తాచాటింది. క్వార్టర్ ఫైనల్లో కెనడాతో తలపడిన భారత అమ్మాయిలు 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టారు. తమ చివరి పూల్-ఏ మ్యాచ్లో విజయంతో పతకం ఖాయం చేసుకుందీ జట్టు. తమ గ్రూప్లో రెండో స్థానంలో ఉన్న భారత్.. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట విజయం సాధించింది.
గ్రూప్ స్టేజిలో ఘనా, వేల్స్, కెనడాలపై విజయం సాధించిన భారత మహిళలు.. కేవలం ఇంగ్లండ్ చేతిలో మాత్రమే ఓటమి చవిచూశారు. ఈ క్రమంలోనే తమ చివరి గ్రూప్ మ్యాచ్లో కెనడాపై విజయం సాధించిన భారత్ సెమీస్ చేరింది.
#Congratulations 🤩
With the win against Canada, Team India have booked a berth to the women's hockey semifinals of the Birmingham Games 2022.(📸Credit: CWG 2022)#CWG2022 #B2022 #CommonwealthGames #CommonwealthGames2022 #CWG22 #CWG2022India #Hockey #HockeyIndia pic.twitter.com/vCnZTvfZlb
— SportsTiger (@sportstigerapp) August 3, 2022