కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత హాకీ జట్టు ఘనవిజయం సాధించింది. కెనడాపై ఏకంగా 8-0 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు పూల్-బీ టాపర్‌గా నిలిచింది. భారత స్టార్ ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్ సింగ్, ఆకాష్దీప్ సింగ్ చెరో రెండు గోల్స్ సాధించగా.. కెనడా ఆటగాళ్లు కనీసం ఒక్క గోల్ చేయకుండా భారత్ నిలువరించింది.
కెనడాపై గెలవడంతో భారత జట్టు 7 పాయింట్లు, 19 గోల్స్ తేడాతో అగ్రస్థానం ఆక్రమిచింది. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కూడా 7 పాయింట్లు సాధించినప్పటికీ.. గోల్స్ డిఫరెన్స్ కేవలం 8 మాత్రమే ఉండటంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత హాకీ జట్టు తమ తర్వాతి మ్యాచ్‌లో గురువారం నాడు వేల్స్‌తో తలపడుతుంది.
✅Dominance
✅Clean-sheet
✅3 points
✅It's good to be #TeamBlue 💙IND 8:0 CAN #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/rWHsOGVVxW
— Hockey India (@TheHockeyIndia) August 3, 2022