కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో 7-0 తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ జట్టు.. తొలి క్వార్టర్లో 2 గోల్స్ చేసింది. ఆ తర్వాత వరుస క్వార్టర్లలో 3-0, 1-0, 1-0 గోల్స్‌తో ఆధిక్యంలోనే నిలిచింది.
దీంతో చివరకు భారత జట్టుకు ఓటమి తప్పలేదు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది భారత్‌కు మూడో రజతం కావడం గమనార్హం. ఈ విజయంతో వరుసగా ఏడుసార్లు హాకీలో కామన్వెల్త్ గోల్డ్ సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది.
SILVER for Men in Blue 🏑#TeamIndia wins Silver Medal 🥈 in Men's Hockey event at #CWG2022.
Congratulations 🎉👏#Cheer4India pic.twitter.com/Ba0vpDyAsN
— Indian Diplomacy (@IndianDiplomacy) August 8, 2022