WTC 2023-25 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 27 ఏళ్ల కలకు రూపమిస్తూ దక్షిణాఫ్రికా (South Africa) తొలిసారి ఐసీసీ టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. లార్డ్స్‌లో తెంబ బవుమా (Temba Bavuma) సారథ్యంలోని సఫారీ జట్ట కొత్త చరిత్ర సృష్టిస్తూ టెస్టు గద (Test Mace)ను అందుకుంది. దాంతో, వరుసగా రెండోసారి విజేతగా నిలవాలనుకున్న కంగారూలకు నిరాశే మిగిలింది. అయితే.. రెండేళ్లుగా ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ సీజన్లో పేసర్ల హవా కొనసాగింది. వీళ్లలో ఆసీస్ స్పీడ్స్టర్లు ఇద్దరూ అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) అత్యధిక వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్‌లో సఫారీలతో జరిగిన ఫైనల్లో నిప్పులు చెరిగిన ప్యాటీ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ సాధించాడు. దాంతో, ఈ సైకిల్లో అతడి పేరిట 80 వికెట్లు ఉన్నాయి. ఆసీస్ సారథి 18 మ్యాచుల్లోనే 80 వికెట్లు పడగొట్టగాడు. భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ యార్కర్ కింగ్ 15 మ్యాచుల్లోనే 77 వికెట్లు తీశాడు.
Pat Cummins finishes as the leading wicket-taker in WTC 2023–25 with 80 wickets.#WtcFinal2025 #PatCummins pic.twitter.com/FhdmfoiOLn
— CricTracker (@Cricketracker) June 15, 2025
డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్ధ శతకంతో ఆసీస్ ఆధిక్యాన్ని 280కి పెంచిన మిచెట్ స్టార్క్ కూడా 70కి పైగా వికెట్లు తీశాడు. యార్కర్లతో బ్యాటర్లను హడలెత్తించే అతడి ఖాతాలో కూడా 77 వికెట్లు ఉన్నాయి. అయితే.. బుమ్రా కంటే 5 మ్యాచులు.. అంటే ఈ స్పీడ్‌స్టర్ 19 మ్యాచులు తీసుకున్నాడు. కంగారూ స్పిన్నర్ నాథన్ లియాన్ 7 టెస్టుల్లో 66 వికెట్లతో నాలుగో స్థానంలో నిలవగా మాజీ స్పిన్నర్ అశ్విన్ (Ashwin) ఐదో స్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే టెస్టులకు వీడ్కోలు పలికిన యశ్.. 14 టెస్టుల్లో 63 వికెట్లు పడగొట్టాడు.
మిచెట్ స్టార్క్(58 నాటౌట్)