IPL 2024 SRH vs CSK : స్వల్ప ఛేదనలో హైదరాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. సిక్సర్ల మోతతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ(37) ఔటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి బౌండ్రీ వద్ద జడేజా చేతికి చిక్కాడు. దాంతో, 46 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ పడింది. మరోవైపు ట్రావిస్ హెడ్(9), ఎడెన్ మర్క్రమ్(10)లు ధాటిగా ఆడుతున్నారు. 4 ఓవర్లకు స్కోర్.. 57/1. హైదరాబాద్ విజయానికి 109 పరుగులు కావాలి.
The 𝐀𝐛𝐡𝐢-𝐬𝐡𝐨𝐰 that set the stadium on fire in the 2️⃣nd over 😱🔥#PlayWithFire #SRHvCSK pic.twitter.com/ttralQ3aSZ
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2024
ముంబై ఇండియన్స్ అర్ధశతకంతో రికార్డు నెలకొల్పిన అభిషేక్ చెన్నై బౌలర్లకు తన ప్రతాపం చూపించాడు. కేవలం 12 బంతుల్లోనే విధ్వంసం సృష్టించాడు. 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 రన్స్ కొట్టాడు. ముకేశ్ ఛౌదరీ వేసిన తొలి ఓవరలో అభిషేక్ రెచ్చిపోయాడు. 4, 6, 6, 4తో 24 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వత దీపక్ చాహర్‌ను ఉతికేస్తూ సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో హైదరాబాద్ స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది.