IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఆసక్తికర పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మైదానంలో 17 ఏళ్లుగా చెన్నై చేతిలో ఓడిపోతున్న ఆర్సీబీ.. ఈసారి విజయం సాధించాలనే కసితో ఉంది. టర్నింగ్ పిచ్ మీద అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్‌లతో కూడిన సూపర్ కింగ్స్ స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం బెంగళూరు బ్యాటర్లకు సవాలే.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, సామ్ కరన్, రవీంద్ర జేడేజా, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), అశ్విన్, నూర్ అహ్మద్, మథీశ పథిరన, ఖలీల్ అహ్మద్.
బెంగళూరు తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియాం లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
🚨 Toss 🚨@ChennaiIPL elected to field against @RCBTweets
Updates ▶️ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB pic.twitter.com/prn0Ckrfo7
— IndianPremierLeague (@IPL) March 28, 2025
తొలి మ్యాచులో గెలుపొందిన ఇరుజట్లకు ఈ పోరు కీలకం కానుంది. దాంతో, ఆర్సీబీ పేస్ దళంలో భువనేశ్వర్ కుమార్‌కు చోటివ్వగా.. యార్కర్లతో బెంబేలెత్తించే పథిరనను జట్టులోకి తీసుకుంది చెన్నై. కోహ్లీ, ధోనీలు మరోసారి తమ మ్యాజిక్‌తో తమ జట్టును గెలిపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ దిగ్గజాల సమరంలో పైచేయి ఎవరిదో మరో మూడున్నర గంటల్లో తేలియనుంది.