కోదాడ, మార్చి 28 : వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ముస్లిం మత పెద్దలు మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది, ముఫ్తీ అతార్ మౌలానా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అన్ని మసీదుల్లో చేతులకు నల్ల రిబ్బన్ పట్టిలు ధరించి ప్రార్థనలు చేశారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారిపై శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందన్నారు. కేంద్ర చర్యలను లౌకికవాదులు ఖండించాలని కోరారు. బిల్లును ఉపసంహరించుకోకపోతే ముస్లింలంతా ఉద్యమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు నయీమ్ భాయ్, మహిమూద్, మజాహార్, మహమ్మద్ సాబ్, మునీర్, అలీబాయ్, అబ్బు, ఆసిఫ్, అల్తాఫ్, జాకీర్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల : నేరేడుచర్లలో జాన్ పహాడ్ రోడ్డులోని మసీదు వద్ద ముస్లింలు నమాజ్ తర్వాత నల్ల బ్యాడ్జిలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేరేడుచెర్ల మసీద్ ముఫ్తీ షోయబ్ ఆలం, సదర్ ఇబ్రహీం, ఖాదర్ ఖాన్, ఖాదర్ పాషా, ఖలిమ్, ఖాజా, హఫీజ్, గౌస్, హనీఫ్, ఖదీర్, యాకూబ్, నజీర్, ఇస్తీయాక్, జానీ పాల్గొన్నారు.
Waqf Board : వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లింల నిరసన