CSK – WPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తిరుగులేని జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఒకటి. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీలో ఐదు ట్రోఫీలు కొల్లగొట్టిన ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లోనూ అడుగు పెట్టనుంది. త్వరలోనే డబ్ల్యూపీఎల్‌లో సీఎస్కే సొంత జట్టు బరిలోకి దిగనుంది.
అవును.. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్(N Srinivasan) కుమార్తె రూపా గురునాథ్ (Rupa Gurunath) తమ జట్టు ఒకటి డబ్ల్యూపీఎల్‌లో ఉండాలని అనుకుంటోంది. అయితే.. ఆమె ఇండియా సిమెంట్స్ (India Cements) గ్రూప్ బాధ్యతలు చేపట్టాకే మహిళా జట్టు కొనుగోలుపై నిర్ణయం తీసుకోనుంది. అదే జరిగితే అభిమానులు పసుపు జెర్సీలో సీఎస్కే మహిళా జట్టును చూడడం ఖాయం.
తండ్రి శ్రీనివాసన్‌తో రూప
Rupa Gurunath, daughter of Srinivasan is evaluating the possibility of the CSK team participating in WPL [Economic Times]
– CSK is currently studying the financial viability & experience of other IPL franchises in WPL. pic.twitter.com/4b5Tyfjmnq
— Johns. (@CricCrazyJohns) August 4, 2024
బీసీసీఐ మాజీ బాస్ అయిన శ్రీనివాసన్‌కు ప్రస్తుతం 79 ఏండ్లు. దాంతో, సీఎస్కే ఫ్రాంచైజీ బాధ్యతలను ఆయన తన కూతురికి అప్పగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA)కు తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన అనభవం రూపా గురునాథ్ సొంతం.
దాంతో, ఇండియా సిమెంట్స్ చీఫ్ పోస్ట్‌ను కూడా ఆమెకు కట్టబెట్టేందుకు శ్రీనివాసన్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్లో హిట్ కొట్టిన తమ ఫ్రాంచైజీని గురునాథ్ మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉంది. డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఆరంభం లోపే సీఎస్కే మహిళా జట్టుపై ఓ స్పష్టత రానుంది.