Sanaya Irani | సినీ ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కోన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వారే కాకుండా.. స్టార్‌స్టేటస్ తెచ్చుకున్న చాలామంది హీరోయిన్లు కూడా ఎప్పుడో ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొని ఉంటారు. అయితే నేను కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదుర్కొన్నానని బాలీవుడ్ బుల్లితెర నటి సనాయ ఇరానీ వెల్లడించింది.
బాలీవుడ్ బుల్లితెర నటి సనాయ ఇరానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమిర్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ‘ఫనా’ సినిమాలో ఓ చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ భామ. తర్వాత షారుఖ్ ఖాన్, కరీనా వంటి ప్రముఖ స్టార్లతో కలిసి వివిధ టీవీ ప్రకటనల్లో నటించింది. అనంతరం బాలీవుడ్ బుల్లితెర వైపు అడుగులు వేసింది. ఇక బాలీవుడ్లో ‘మిలే జబ్ హమ్ తుమ్ అండ్ ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్’ వంటి టీవీ సిరీయల్స్‌లో నటించి స్టార్ బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాస్టింగ్ కౌచ్ వేధింపులు తానుకూడా అనుభవించినట్లు తాజాగా తెలిపింది.
నేను ఒక దగ్గర మ్యూజిక్ అడిషన్ జరుగుతుంది రమ్మంటే వెళ్లాను. కానీ వెళ్లిన తర్వాత చూస్తే అక్కడ సినిమా అడిషన్ అవుతుంది. అయితే సెక్రటరీకి నేను చెబుతూ.. నేను మ్యూజిక్ అంటే అడిషన్ అంటే వచ్చాను. నేను సినిమా అయితే చేయలేను అన్నాను. దానికి సెక్రటరీ సార్‌కి తెలిస్తే కోపం వస్తుంది. అతడితో ఒకసారి మాట్లాడండి అన్నాడు. అయినతో మాట్లాడానికి వెళ్లగా.. ఆయన చెబుతూ.. నేను పెద్ద సినిమా చేయబోతున్నాను. ఇందులో చాలామంది అగ్ర హీరోలు నటించబోతున్నారు. నువ్వు కూడా మూవీలో బికినీ వేసుకోవాలి అన్నాడు. అప్పుడు నేను అడుగుతూ.. నా పాత్ర ఏంటి అని అతడిని అడిగాను. అతను కొంచెం రూడ్‌గా మాట్లాడుతూ.. బికినీ వేసుకోవడం నీకు ఒకేనా అని అడిగాడు. దాంతో నాకు కోపం వచ్చి అక్కడ నుంచి వచ్చేశాను.
ఆ తర్వాత అతని సెక్రటరీ చెప్పడంతో నేను అతనికి కాల్ చేసాను. నేను మీటింగ్‌లో ఉన్నా.. అరగంట తర్వాత నాకు కాల్ చేయండి అన్నాడు. మరోసారి 45 నిమిషాల తర్వాత కాల్ చేశా. ఇప్పుడు టైం ఎంత? నిన్ను ఏ సమయానికి చేయమని అడిగాను? అని నాపై కోప్పడ్డాడు. దీంతో అతనికి దర్శకుడిగా పనికిరాని వాడని నాకర్థమైంది అని చెప్పుకోచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో కూడా నాకు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయి. అందుకే ఏ సినిమా ఒప్పుకోలేదు అంటూ సనయా వెల్లడించింది.