IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)ను దురదృష్టం గాయాల రూపంలో వెంటాడుతోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఒక్కొక్కరు టోర్నీకి దూరమవుతున్నారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడి ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ రామకృష్ణ ఘోష్ (Ramakrishna Ghosh) అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శనివారం చెపాక్‌లో ఫీల్డింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఈ కుర్రాడు గాయం కారణం మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన రామకృష్ణ ఘోష్ పాదం గాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. దాంతో, పంతొమ్మిదో సీజన్లో సత్తా చాటాలనుకున్న అతడికి చుక్కెదురైంది. రామకృష్ణ సీజన్‌కు దూరమయ్యాడని ఆదివారం హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు.
‘రామకృష్ణ ఇటీవల గొప్పగా మెరుగయ్యాడు. అకాడమీలో అతడు చాలా కష్టపడుతున్నాడు. అతడు మంచి ఆల్‌రౌండర్. అయితే.. దురదృష్టవశాత్తూ అతడు టోర్నీకి దూరమయ్యాడు. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఇంతకూ రామకృష్ణ మ్యాచ్‌లో ఎలా గాయపడ్డాడు? అనేది తెలియాల్సి ఉంది.
OFFICIAL ANNOUNCEMENT:
Ramakrishna Ghosh sustained a fracture to his right foot during the CSK v MI match at Chepauk.
He will take no further part in IPL 2026.
Get well soon, Rambo. pic.twitter.com/CQve4zLixG— Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2026
అసలే బ్యాటింగ్.. బౌలింగ్ తడబాటు నుంచి తేరుకుని గెలుప తోవ తొక్కిన చెన్నై సూపర్ కింగ్స్‌ను గాయాలు వదలడం లేదు. గాయం నుంచి కోలుకుంటున్న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక పేసర్ నాథన్ ఎల్లిస్ ఆరంభానికి ముందే వైదొలలిగాడు.

సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్ టోర్నీ మధ్యలో గాయపడగా.. కుర్రాడు ఆయుశ్ మాత్రే కండరాల చీలకతో సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఇప్పుడు రామకృష్ణ సైతం అదే కారణంతో తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారు? అనేది రెండు మూడు రోజుల్లో తెలియనుంది.