CSK CEO : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు ట్రేడింగ్ డీల్ అభిమానులకు షాక్ ఇస్తోంది. కొత్తదనం కోసం, జట్టు అవసరాల కోసం దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను వదిలేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొన్నిరోజులుగా జరుగుతున్న చర్చలు ఫలవంతం కావడంతో సంజూ శాంసన్‌ను తెచ్చుకొని.. జడ్డూ, సామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు(Rajasthan Royals) అప్పగించింది సీఎస్కే. ఐపీఎల్ చరిత్రలోనే తమ ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా కష్టమైనదని సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు.
‘మా ఫ్రాంచైజీ ట్రేడ్ డీల్‌ను ఇదివరకూ ఒకేసారి ఉపయోగించింది. అది కూడా రాబిన్ ఊతప్ప కోసం. టాపార్డర్‌లో భారత ఆటగాడి కోసం చూస్తున్నాం. కానీ, వేలంలో ఎవరూ కనిపించడం లేదు. అందుకే.. సంజూ శాంసన్ కోసం ట్రేడ్ డీల్ ద్వారా జడేజాను వదిలేయాల్సి వచ్చింది. చెన్నై జట్టు విజయాల్లో కీలకమైన జడ్డూను కోల్పోవడం కొంచెం బాధాకరమే. మా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారనేది నిజమే. ఐపీఎల్లో 4,500 పరుగులు సాధించిన శాంసన్ చెన్నైకి పక్కాగా సరిపోతాడు. కాంబినేషన్ పరంగా జడ్డూను కాదనుకోవడాన్ని ఫ్యాన్స్ అర్ధం చేసుకుంటారని నమ్ముతున్నా. వచ్చే సీజన్లలో సీఎస్కే ఇకముందులానే నిలకడగా రాణిస్తుందని భావిస్తున్నా’ అని విశ్వనాథన్ పేర్కొన్నాడు.
“Decision taken on mutual agreement with Jadeja and Curran.” – CSK MD Kasi Viswanathan speaks on the trade. #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/8HAZrdIBJP
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
ఐపీఎల్ రీటెన్షన్ గడువు వేళ.. 19వ సీజన్ ట్రేడ్ డీల్‌లో భాగంగా సంజూను తీసుకొని జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు ఇచ్చేసింది చెన్నై. ఆల్‌రౌండర్లు అయిన ఈ ఇద్దరినీ ఏకకాలంలో వదులుకోవడం నెట్టింట చర్చనీయాంశమవుతోంది. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ హీరో అయిన కరన్ 2021, 2022, 2025 సీజన్లలో ఎల్లో జెర్సీతో ఆడాడు. జడ్డూ విషయానికొస్తే.. సీఎస్కే ఐదు టైటిళ్ల విజయంలో అతడిది కీలకమైన పాత్ర.
200 Matches
2354 Runs
152 wickets
94 catchesWhen history speaks of courage in Yellove,
it will echo your name. 💛⚔️Thank You, Ravindra Jadeja! 🫡#WhistlePodu #ThalapathyForever pic.twitter.com/WNMlgSOIgD
— Chennai Super Kings (@ChennaiIPL) November 15, 2025
2023 ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ధనాధన్ ఆడి చెన్నైని గెలిపించాడీ ఆల్‌రౌండర్. ట్రేండిగ్ డీల్‌లో జడేజా ధరను రూ.18 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గించారు. సామ్ కరన్‌ను రూ.2.4 కోట్లకే పట్టేసింది రాజస్థాన్.ఐపీఎల్ ఆరంభ సీజన్(2008)లో రాయల్స్‌కు ఆడిన జడేజా.. మళ్లీ ఆ టీమ్ జెర్సీ వేసుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. తనకు రాజస్థాన్ ఎల్లప్పుడూ ఇంటిలానే అనిపిస్తుందని చెప్పాడీ మ్యాచ్ విన్నర్.