రియాద్: సుమా రు రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్ ప్రపంచాన్ని తన ఆటతో ఉర్రూతలూగిస్తున్న పోర్చుగల్ ఫుట్‌బాట్ జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో వచ్చే ఏడాది ఆటకు వీడ్కోలు పలుకనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ఖరారుచేశాడు.
2026లో యూఎస్ఏ, మెక్సికో, కెనడా వేదికగా జరుగబోయే ఫిఫా ప్రపంచకప్ తనకు చివరిదని తెలిపాడు. రిటైర్మెంట్పై అడిగిన ప్రశ్నకు అతడు సమాధానమిస్తూ.. ‘అవును.. కచ్చితంగా’ అని చెప్పాడు.