Happy Mothers Day : అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ తల్లి త్యాగాన్ని, ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు. తమకు కెరియర్ ఆసాంతం అండగా ఉంటూ వచ్చిన మాతృమూర్తిని కొనియాడుతూ సామాజిక మ్యాధ్యమాల్లో పోస్ట్‌లు పెడుతున్నారు. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఎక్స్‌లో పోస్ట్ ద్వారా అమ్మ రజినీ టెండూల్కర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
‘మా అమ్మ ప్రార్థనలు, ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ప్రతిదీ ఆరంభిస్తాను. ప్రతి తల్లి తన పిల్లలకు అండగా ఉన్నట్టే.. మా అమ్మ రజినీ ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటుంది. ఈ శుభదినం సందర్భంగా అద్భుతమైన అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే’ అని సచిన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
Everything I am started with her prayers and her strength. My Aai has always been my anchor, just like every mother is for her child.
Wishing all the incredible mothers a very Happy Mother’s Day!
#MothersDay pic.twitter.com/AUSnZC7G6L— Sachin Tendulkar (@sachin_rt) May 11, 2025
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(YuvrajSingh), మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axar Patel) సైతం మదర్స్ డే పోస్ట్‌లతో వార్తల్లో నిలిచారు. ‘అమ్మలు తమకంటూ ఏదో ఒకటి కావాలని తరచూ పిల్లలను అడగరు. కానీ, పిల్లలకు ప్రతిదీ ఇస్తారు. ప్రేమ పంచుతారు. అండగా నిలుస్తారు. ఓపికగా, నిస్వార్థంగా ఉండే వాళ్ల మంచితనంతోనే కుటుంబాలు కలిసిమెలసి ఉంటున్నాయి. అలాంటి వాతావరణంలోనే పెరిగినందుకు నేను చాలా లక్కీ. ఇప్పటికీ మా ఇంట్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. హ్యాపీ మదర్స్ డే. నాకోసం అన్నీ చేసిన అమ్మ షబ్నమ్ సింగ్‌కు కృతజ్ఞతలు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానమ్మా’ అని యూవీ వెల్లడించాడు.
Mothers don’t always ask for much, but they give everything – love, strength, patience and a kind of selflessness that holds families together.
I’ve been lucky to grow up with that, and to still be surrounded by it every day. Happy Mother’s Day! Thank you for everything. Love… pic.twitter.com/1BbROp8XaZ
— Yuvraj Singh (@YUVSTRONG12) May 11, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ప్లే ఆఫ్స్ రేసులో నిలిపిన అక్షర్ మదర్స్ డే పోస్ట్‌లో మాతృమూర్తుల గొప్పదనాన్ని వివరించాడు. ‘అమ్మ కావడం, అమ్మలా ప్రేమ పంచడం అనేవి చాలా గొప్ప విషయాలు. అందుకే నేను ఇప్పటికీ మదర్స్‌కు సెల్యూట్ చేస్తాను. ఒకరు నన్ను పెంచి పెద్ద చేస్తే.. మరొకరు తల్లిగా నా కుమారుడిని చూసుకుంటున్నారు. ఈ ఇద్దరూ నా ప్రపంచం’ అంటూ రాసుకొచ్చాడీ ఆల్‌రౌండర్.
Maa banne ka jazba… aur maa ki mamta — dono ko aaj salaam.
Ek ne mujhe sambhala, doosri mere bete ko.
Dono hi meri duniya hain.
Happy Mother’s Day ❤️💕 pic.twitter.com/PxUhlGKrvV— Axar Patel (@akshar2026) May 11, 2025
‘పసివాడిగా నీ ఒడిలో ఒదిగిపోయాను. ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా నీకు పసిపిల్లాడినే అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మా అంటూ’ ఇర్ఫాన్ తన ఎమోషనల్ పోస్ట్‌లో తల్లి ఒడిలో కూర్చున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడీ కామెంటేటర్. యువక్రికెటర్ షఫాలీ వర్మ (Shafali Verma) సైతం అమ్మ పర్వీన్ బాలాతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.