సౌతాంప్టన్ : వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో.. మొదటి రోజు శుక్రవారం వర్షం వల్ల పూర్తి ఆట రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే భారతీయ క్రికెటర్లు మాత్రం ఆ తీరిక వేళ బిజీ బిజీగా గడిపారు. కొందరు ఆటగాళ్లు డార్ట్ గేమ్‌తో కాలక్షేపం చేశారు. తమ ట్యాలెంట్‌కు మరింత పదును పెట్టారు. స్పిన్నర్ అశ్విన్‌తో పాటు మరికొంత మంది ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్.. డార్ట్ గేమ్‌ను ఎంజాయ్ చేశారు. ఇవాళ రెండవ రోజు కూడా సౌతాంప్టన్‌లో వర్షం ఉన్నది. కానీ తొలి సెషన్ మాత్రం వర్షం అడ్డంకి లేకుండా సాగే అవకాశాలు ఉన్నాయి. వెదర్ రిపోర్ట్ ప్రకారం సౌతాంప్టన్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం కురిసే ఛాన్సు ఉంది.
When rain didn't stop play 😉#TeamIndia members enjoyed a game of dart on the sidelines during the rain break in Southampton 🎯#WTC21 Final pic.twitter.com/nirjCfzjMM
— BCCI (@BCCI) June 18, 2021