Cricket Scotland : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లోకి స్కాంట్లాండ్ (Scotland ) అనూహ్యంగా వచ్చేసింది. మొన్నటివరకూ ద్వైపాక్షిక సిరీస్‌లకు సన్నద్ధమైన ఆ జట్టు ఇప్పుడు వరల్డ్‌కప్ బరిలోకి దిగనుంది. బంగ్లాదేశ్ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా బెర్తు సాధించిన స్కాంట్లాడ్.. తమకు అవకాశం కల్పించినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC)కి కృతజ్ఞతలు తెలిపింది. ఆ దేశ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రుడీ లిండ్బ్లేడ్ ఐసీసీ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నామని చెప్పాడు.
భారత్‌లో వరల్డ్‌కప్ ఆడబోమన పతంపట్టిన బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. యూరప్ దేశమైన స్కాట్లాండ్కు అవకాశమిచ్చింది ఐసీసీ. బంగ్లాదేశ్ బోర్డు డిమాండ్లు ఐసీసీ నిబంధనలకు లోబడిలేనందున.. షెడ్యూల్ మార్చే ప్రసక్తే లేదని సీఈవో సనోజ్ గుప్తా శనివారం ఐసీసీకి లేఖ రాశాడు. దాంతో.. అధికారికంగా ప్రపంచకప్ బరిలోని 20 జట్ల జాబితాలోంచి బంగ్లాను తప్పించి.. స్కాట్లాండ్కు చోటు కల్పించారు. ప్రపంచకప్ బెర్తు ఆడలేకపోయామనే దిగులుతో ఉన్న స్కాట్లాండ్ క్రికెట్, ఆటగాళ్లు ఐసీసీ ఆహ్వానంతో ఎగిరి గంతేశారు.
‘శనివారం ఐసీసీ నుంచి మాకు ఆహ్వానం అందింది. పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం మీ జట్టును పంపిస్తారా? అని ఐసీసీ మమ్మల్ని అడిగింది. అత్యున్నత క్రికెట్ బోర్డు ప్రతిపాదనను మేము స్వాగతించామ’ని ట్రుడీ లిండ్బ్లేడ్ వెల్లడించాడు. ‘స్కాంట్లాండ్‌కు వరల్డ్‌కప్ ఆడే అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఐసీసీ అధ్యక్షుడు జై షా నిర్ణయాన్ని మా జట్టు తరఫున స్వాగతిస్తున్నాం. విశ్వవేదికపై.. లక్షలాదిమంది అభిమానుల మధ్య ఆడడం స్కాట్లాండ్ ఆటగాళ్లకు దక్కిన మహాద్భుత అవకాశం ఇది.
Our men’s squad are heading to India… ✈️ 🇮🇳 🏆https://t.co/SHqaos2bCz #FollowScotland #ChooseCricket pic.twitter.com/HPgfF9Grf7
— Cricket Scotland (@CricketScotland) January 24, 2026
ఊహించని పరిణామాలతో మాకు వరల్డ్‌కప్ బెర్తు దక్కిందనే విషయం మాకు తెలుసు. ఇప్పటివరకూ మా జట్టు విదేశీ పర్యటనలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు భారత్‌లో ప్రపంచకప్ కోసం సన్నద్ధం కానుంది’ అని క్రికెట్ స్కాట్లాండ్ చైర్మన్ విల్ఫ్ వాల్ష్ పేర్కొన్నాడు. త్వరలోనే స్క్వాడ్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపాడు.
A look at the groups for the upcoming Men’s #T20WorldCup that commences on February 7 👀
More 📲 https://t.co/IojRKHMmt3 pic.twitter.com/fU42FYrdKy
— ICC (@ICC) January 25, 2026
భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. గ్రూప్ సీలో బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసిన స్కాంట్లాడ్ కోల్‌కతాలో ఆరంభం రోజున కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇప్పటివరకూ తొలి ఎడిషన్‌తో కలిపి ఐదుసార్లు (2007, 2009, 2016, 2021 and 2022) ఈ మెగా ఈవెంట్లో ఆడిన స్కాంట్లాండ్ ఈసారి అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది.