ఢిల్లీ: వచ్చే ఏడాది జపాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా క్రీడల్లోనూ క్రికెట్ తన స్థానాన్ని నిలుపుకుంది. తొమ్మిదేండ్ల విరామం తర్వాత 2023 హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో తిరిగి చోటు దక్కించుకున్న క్రికెట్.. తన స్థానాన్ని నిలుపుకున్నదని తాజాగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
2026 సెప్టెంబర్-అక్టోబర్ మధ్య జపాన్‌లోని ఐచి-నగోయలో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఈ మేరకు ఓసీఏతో పాటు ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ నగోయలో నిర్వహించిన సమావేశంలో.. క్రికెట్‌తో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కూ ఆమోదం లభించినట్టు వెల్లడించింది. హాంగ్జౌలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు సాధించిన విషయం తెలిసిందే.