Stuart Law : నేపాల్ క్రికెట్ బోర్డు పురుషుల జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ను నియమించింది. సుదీర్ఘ అనుభవజ్ఞుడైన స్టువార్ట్ లా(Stuart Law )ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడైన స్టువార్ట్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఆసీస్ మాజీ ఆటగాడు రెండేళ్ల పాటు సేవలందించనున్నాడు. ఇంతకుముందు కోచ్‌గా పని చేసిన మాంటీ దేశాయ్ పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసింది. జూన్‌లో వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో, కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది.
ఈ క్రమంలోనే గతంలో వెస్టీండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్థాన్.. వంటి జట్లకు కోచ్‌గా పనిచేసిన స్టువార్ట్‌ను నేపాల్ క్రికెట్ పెద్దలు సంప్రదించారు. తర్జాతీయ క్రికెట్లో పసికూనగా ముద్ర పడిన తమ టీమ్ రాత మార్చేందుకు అతడిని ఏరికోరి మరీ కోచ్‌గా నియమించింది నేపాల్ బోర్డు.
🇳🇵 Head Coach Appointed! 🚨
Australian legend Stuart Law @SLaw365 takes charge of Nepal Men’s National Cricket Team for the next two years! 🏏💪#NepalCricket pic.twitter.com/5G7C2H7H0f
— CAN (@CricketNep) March 28, 2025
ఆస్ట్రేలియా తరఫున 54 వన్డేలు, ఒకే ఒక టెస్టు ఆడిన స్టువార్ట్.. 1966 వరల్డ్ కప్ రన్నరప్ జట్టులో సభ్యుడు. వీడ్కోలు తర్వాత కోచ్‌గా అవతారమెత్తిన అతడు.. నిరుడు అమెరికా జట్టు టీ20 వరల్డ్ కప్‌లో సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అందుకే తమ జట్టును గాడీలో పెట్టేందుకు.. మళ్లీ విజయాల బాట పట్టించేందుకు ఈ ఆసీస్ మాజీనే సరైనోడు అని భావించింది నేపాల్ బోర్డు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడిని హెడ్‌కోచ్‌గా ప్రకటించింది.
అంతర్జాతీయ స్థాయిలో పలు జట్లకు కోచ్‌గా సేవలందించిన అనుభవం స్టువార్ట్‌కు ఉంది. అతడి హయాంలోనే బంగ్లాదేశ్ అండర్-19 జట్టు 2022లో ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గానే కొన్నాళ్లు కొనసాగాడు స్టువార్ట్. నేపాల్ జట్టు విషయానికొస్తే.. 2023లో ఆసియా కప్ పోటీలకు తొలిసారి అర్హత సాధించింది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆడింది. కానీ, మూడు మ్యాచుల్లో ఓటమితో నిరాశపరిచింది. వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా ఈ ఏడాది జూన్‌లో స్కాంట్లాడ్, నెదర్లాండ్స్, నేపాల్ మధ్య ముక్కోణపు సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపాల్.. స్టువార్ట్ సలహాలు, సూచనలతో అదిరే ప్రదర్శన చేయాలనుకుంటుంది.