Narasimha Nayak | లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపెడుతాం : నరసింహానాయక్
Narasimha Nayak | రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ శాసన సభ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వబోమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు నరసింహానాయక్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
రవీంద్రభారతి : రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ (Lambadis) శాసన సభ్యులకు మంత్రి(Minister ) పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వబోమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు నరసింహానాయక్ (Narasimha Nayak) ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
శనివారం బషీర్‌బాగ్‌లో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం .. లంబాడిల ఆత్మగౌరవాన్ని పెంచుతామని చెప్పి ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి లంబాడీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. లంబాడీల కంటే జనాభా తక్కువ ఉన్న ఓ వర్గానికి ఐదు మంత్రి పదవులు, 20కిపైగా కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారని, 10 శాతం ఉన్న లంబాడీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం లంబాడీ జాతిని అవమానించడమేనని అన్నారు.
60 నియోజకవర్గాలలో అత్యధికంగా లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన లంబాడీలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR) మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించారని, చందులాల్, సత్యవతి రాథోడ్‌కు చోటు కల్పించిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. కేసీఆర్ హాయంలో లంబాడీలకు స్వర్ణయుగంగా ఉండేదని స్పష్టం చేశారు. మాయమాటలు చెప్పి ఓటువేసినందుకు లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

