Mens Cricket | టీమిండియాకు బిగ్ షాక్.. గాయాలతో జట్టుకు దూరమైన రాహుల్, జడేజా.. సర్ఫరాజ్‌కు చోటు
Mens Cricket | ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్’ టెస్ట్ సిరీస్‌లో సెకండ్ టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వారి స్థానంలో సెలెక్షన్ కమిటీ.. సర్ఫారాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మీడియాకు వెల్లడించింది.
Mens Cricket: ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల ‘ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్’ టెస్ట్ సిరీస్‌లో సెకండ్ టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వారి స్థానంలో సెలెక్షన్ కమిటీ.. సర్ఫారాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మీడియాకు వెల్లడించింది.
హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడ్డారు. తొలి టెస్టు నాలుగో రోజైన ఆదివారం జడేజాకు తొడ నరాలు పట్టేయగా, కేఎల్ రాహుల్ కుడి తొడ కండరాల్లో నొప్పితో బాధపడుతున్నాడు. దాంతో ఇద్దరూ ఫిబ్రవరి 2 (వచ్చే శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యారు. దాంతో సర్ఫరాజ్, సౌరభ్, సుందర్‌లకు జట్టులో చోటు దక్కింది.
కొత్తగా జట్టులోకి వచ్చిన ముగ్గురిలో సర్ఫరాజ్, సుందర్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడిన భారత్-ఎ జట్టులో సభ్యులుగా ఉన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో సర్ఫరాజ్ 161 పరుగుల భారీ సెంచరీ సాధించాడు. సుందర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ లయన్స్‌పై భారత్-ఎ జట్టు ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

