న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ జోరుగా కొనసాగుతున్నది. మొత్తం 45 మ్యాచ్‌ల ఈ టోర్నీలో ఇవాళ భారత్-పాకిస్థాన్ దేశాలు 16వ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ సూపర్-12 మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో అభిమానులు హోమం నిర్వహించారు. క్రికెట్ టీమ్ ఫొటోకు హారతి ఇచ్చారు. ఇక కర్ణాటకలోని కలబురగిలో కూడా క్రికెట్ అభిమానులు భారత జట్టు గెలువాలంటూ పూజలు చేశారు.
ఇప్పటివరకు ఐదు సార్లు టీ20 వరల్డ్ కప్ టోర్నీలు జరుగగా ఒకసారి భారత్, ఒకసారి పాకిస్థాన్ జట్టు టైటిల్ గెలిచాయి. ఇక ఐదు టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ తలపడిన ప్రతి మ్యాచ్‌లో భారత జట్టే విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Cricket fans from Punjab's Ludhiana (pic 1 & 3) to Karnataka's Kalaburagi (pic 2 & 4) pray for Team India's win against Pakistan in ICC T20 World cup match at Dubai#INDvPAK pic.twitter.com/HQPbk3SBRw
— ANI (@ANI) October 24, 2021