Ashwin : అంతర్జాతీయ క్రికెట్‌తో పాటూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. విదేశీ లీగ్స్‌లో ఆడేందుకే ఐపీఎల్ నుంచి వైదొలిగానని చెప్పిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్‌ను తమ లీగ్‌లో ఆడించాలని నిర్వాహకులు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20లీగ్ (ILT20)లో అశ్విన్ పేరు రిజిష్టర్ చేసుకున్నాడు . అయితే.. ఆస్ట్రేలియా టీ20లీగ్ నిర్వాహకులు ఈ వెటరన్ ప్లేయర్‌ను సంప్రదించారు. ఒకవేళ ఓకే చెప్పాడంటే బిగ్‌బాష్ లీగ్(Big Bash League)లో ఆడిన తొలి భారతీయుడిగా అశ్విన్ చరిత్ర సృష్టించే అవకాశముంది.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం అశ్విన్‌ను బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్బర్గ్ (Todd Greenberg) కోరాడు. ప్రస్తుతం ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాడు బీబీఎల్‌లో ఆడడం మాకెంతో లాభిస్తుంది. అతడొక ఛాంపియన్ క్రికెటర్. అతడి రాకతో మా టీ20 టోర్నీ మరింత ఆసక్తిగా మారనుంది అని గ్రీన్బర్గ్ తెలిపాడు. ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలంలో అశ్విన్‌ను రూ.9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొన్నది.
🚨CRICBUZZ EXCLUSIVE🚨
Ravichandran Ashwin could be all set to become the first high-profile Indian cricketer to feature in the Big Bash League (BBL). And it could happen as early as the upcoming season pic.twitter.com/eaWx3rnCXb
— Cricbuzz (@cricbuzz) September 2, 2025
ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బు ఇస్తే బీబీఎల్‌లో ఆడేందుకు ఈ స్పిన్ మాంత్రికుడు అంగీకరించడం ఖాయం అనిపిస్తోంది. అయితే.. అతడు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు? టోర్నీలో తలపడే ఎనిమిది జట్లలో అశ్విన్‌ను తీసుకునేది ఎవరు? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ స్పిన్ దిగ్గజం మెల్బోర్న్ రెనెగ్రేడ్స్కు ప్రాతినిధ్యం వహిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐఎల్టీ20 నాలుగో సీజన్ కోసం సెప్టెంబర్ 30న జరుగబోయే వేలం జరుగనుంది. ఒకవేళ ఆస్ట్రేలియా ఆఫర్‌ను అశ్విన్ తిరస్కరిస్తే ఈ లీగ్‌లో ఆడనున్న నాలుగో భారతీయుడిగా గుర్తింపు సాధిస్తాడు. ఇప్పటివరకూ రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు ఐఎల్టీ20లో తమ సత్తా చాటారు. ఆరంభ సీజన్ నుంచి ఈ మెగా టోర్నీలో ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో ఐపీఎల్ సిస్టర్ ఫ్రాంచైజీ టీమ్స్ కూడా ఉన్నాయి. ఆ ఆరు టీమ్‌లు ఇవే.. అబుదాబీ నైట్ రైడర్స్, డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్స్.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Ravichandran Ashwin has announced his retirement from the IPL after featuring in 220 matches, taking 187 wickets and scoring 833 runs! 💛🙌#RavichandranAshwin #IPL #CSK #Sportskeeda pic.twitter.com/3DakomIAUN
— Sportskeeda (@Sportskeeda) August 27, 2025
ఐపీఎల్లో విజయవంతమైన బౌలర్ అయిన అశ్విన్ ఐదు ఫ్రాంచైజీల తరఫున ఇరగదీశాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు(187) తీసిన ఐదో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడీ స్పిన్ దిగ్గజం. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 97 వికెట్లు తీశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున 35 వికెట్లు, పంజాబ్ కింగ్స్ బౌలర్‌గా 25 వికెట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ అస్త్రంగా 20 వికెట్లు, పుణే రైజింగ్ సూపర్ జెయింట్స్ ప్రధాన స్పిన్నర్‌గా 10 వికెట్లు పడగొట్టాడీ వెటరన్.