T20 World Cup 2024 : క్రికెట్లో జాతీయ జట్టుకు ఆడే చాన్స్ వస్తేనే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది ఏకంగా టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) టీమ్‌లో ఉంటే ఆయా క్రికెటర్ల ఆనందానికి హద్దే ఉండదనుకో. ఐసీసీ టోర్నీల్లో దేశపు జెర్సీని ధరించే చాన్స్ అంత ఈజీగా రాదు. కానీ, వీళ్లకు మాత్రం అదృష్ట దేవత బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రెండు దేశాల తరఫున టీ20 వరల్డ్ కప్‌లో ఆడేశారు.
తాజాగా న్యూజిలాండ్ ఆటగాడు కొరె అండర్సన్(Corey Anderson) అమెరికా జెర్సీతో బరిలోకి దిగాడు. విధ్వంసక ఆల్‌రౌండర్ అయిన అండర్సన్ 2014, 16 ఎడిషన్‌లో కివీస్ జట్టుకు ఆడాడు. ఇప్పుడు యూఎస్ఏ జెర్సీతో బరిలోకి దిగిన అతడు పొట్టి ప్రపంచకప్‌లో రెండు దేశాలకు ఆడిన ఐదో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అండర్సన్ కంటే ముందు డబుల్ జెర్సీ ధరించిన క్రికెటర్లు ఎవరంటే..?
దక్షిణాఫ్రికాకు చెందిన రొలోఫ్ వాన్ డెర్మెర్వె(Roelof Van der Merve) వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పేస్ బౌలర్ అయిన డిర్క్ నేన్స్(Dirk Nannes) ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జెర్సీలతో పొట్టి ప్రపంచకప్‌లో దుమ్మురేపాడు.
🔸 Roelof van der Merwe – 🇿🇦🇳🇱
🔹 Dirk Nannes – 🇳🇱🇦🇺
🔸 Mark Chapman – 🇭🇰🇳🇿
🔹 David Wiese – 🇿🇦🇳🇦
🔸 Corey Anderson – 🇳🇿🇺🇸Corey Anderson becomes the fifth player to represent two different countries at the T20 World Cup 🏏🏆#CricketTwitter #USAvCAN pic.twitter.com/lqNcJiW79x
— Sportskeeda (@Sportskeeda) June 2, 2024
ఈ జాబితాలో కివీస్ యువ కెరటం మార్క్ చాప్మన్ (Mark Chapman) సైతం ఉన్నాడు. ఈ యంగ్‌స్టర్ గతంలో హాంకాంగ్‌కు ఆడాడు. ప్రస్తుతం ఈ కుర్రాడు న్యూజిలాండ్ జెర్సీతో వరల్డ్ కప్ ఆడుతున్నాడు. స్పీడ్‌స్టర్ డేవిడ్ వీస్ కూడా డబుల్ జెర్సీతో తళుక్కుమన్నాడు. అతడు దక్షిణాఫ్రికా, నమీబియా జట్ల తరఫున టీ20 వరల్డ్ కప్‌లో సత్తా చాటాడు.