Arvind Kejriwal | ఎగ్జిట్ పోల్స్ ఫేక్.. ఈవీఎంలను తారుమారు చేసేందుకే: అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal | ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్‌ను (Arvind Kejriwal) విడుదల చేశారని ఆయన ఆరోపించారు. ఆదివారం జైలులో సరెండర్‌కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ నిన్న (శనివారం) వెలువడ్డాయి. నేను చెప్పేది రాసుకోండి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేక్. ఒక ఎగ్జిట్ పోల్ రాజస్థాన్‌లో బీజేపీకి 33 సీట్లు ఇచ్చింది. అయితే అక్కడ మొత్తం 25 సీట్లు మాత్రమే ఉన్నాయి’ అని అన్నారు.
కాగా, ఈవీఎంలను తారుమారు చేసేందుకే బీజేపీకి అనుకూలంగా, ఏకపక్షంగా ఎగ్జిట్స్ పోల్స్ వెలువడ్డాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ‘అసలు సమస్య ఏమిటంటే, కౌంటింగ్‌కు మూడు రోజుల ముందు నకిలీ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు వెల్లడించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి అనేక సిద్ధాంతాలున్నాయి. యంత్రాలను (ఈవీఎంలు) మార్చడానికి వారు ప్రయత్నిస్తున్నారన్నది వాటిలో ఒకటి’ అని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350కు పైగా సీట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్‌పై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
#WATCH | Delhi CM Arvind Kejriwal says "Exit polls for 2024 Lok Sabha Elections have come out yesterday. Take it in writing, all these exit polls are fake. One exit poll gave 33 seats to BJP in Rajasthan whereas there are only 25 seats there…The real issue is why they had to do… pic.twitter.com/oLkdoxh3ZL
— ANI (@ANI) June 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

