IPL 2023 | చెపాక్‌లో చెన్నై జోరు.. హైదరాబాద్‌కు నాలుగో ఓటమి
IPL 2023 : చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జోరు కొనసాగించింది. ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ 134 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత డెవాన్ కాన్వే(77 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్(35) దంచారు. మోయినీ అలీ బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు.
IPL 2023 : చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జోరు కొనసాగించింది. ఆల్‌రౌండ్ షోతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లు విజృంభించడంతో హైదరాబాద్ 134 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత డెవాన్ కాన్వే(77 నాటౌట్) అర్థ శతకంతో చెలరేగాడు. రుతురాజ్ గైక్వాడ్(35) దంచారు. మోయినీ అలీ బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దాంతో, మర్క్రం సేన వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. నాలుగు విజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
టార్గెట్ చిన్నదే.. అయినా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ మొదలెట్టారు. డెవాన్ కాన్వే(77) అజేయంగా నిలిచి హాఫ్ సెంచరీ బాదాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన పదకొండో ఓవర్లో ఆఖరి బంతికి ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(35) రనౌటయ్యాడు. దాంతో, 87 రన్స్ వద్ద సీఎస్కే తొలి వికెట్ పడింది. ఫామ్‌లో ఉన్న అజింక్యా రహానే(9) విఫలమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంబటి రాయుడు(9), మోయిన్ అలీ(6 నాటౌట్)తో కలిసి కాన్వే లాంఛనం పూర్తి చేశారు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీశాడు.
Devon Conway is having an excellent time with the bat this season 🔥🔥
Fifty off just 34 deliveries for the opener as @ChennaiIPL move to 86/0 at the end of 10 overs.
Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/Om21m8lix1
— IndianPremierLeague (@IPL) April 21, 2023
టాపార్డర్ విఫలం
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ టాపార్డర్ కుప్పకూలింది. జడేజా మూడు వికెట్లు తీయడంతో మరక్రం సేన 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(34), హ్యారీబ్రూక్(18) తక్కువకే పెవిలియన్ చేరారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి(21) రెండో వికెట్‌కు 36 రన్స్ జోడించారు. కెప్టెన్ ఏయిడెన్ మర్క్రం(12), మయాంక్ అగర్వాల్(2) విఫలమయ్యారు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్(17), మార్కో జాన్సెన్(17) పోరాడడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు, మథీశ పథిరన, ఆకాశ్ సింగ్, మహీశ్ థీక్షణ తలా ఒక వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

