హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : మొరాకో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి టోర్నీలో తెలంగాణకు చెందిన బానోతు ఆకీరా నందన్ అదరగొట్టాడు. 400మీటర్ల రేసును 53.07 సెకన్లలో పూర్తి చేసిన అకీరా పసిడి పతకంతో మెరిశాడు. అదే జోరు కొనసాగిస్తూ 200మీటర్ల పరుగు పందెంలోనూ కాంస్యాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
హైదరాబాద్ కూకట్పల్లి డిపోనకు చెందిన కండక్టర్ బానోతు మోహన్ కొడుకు అకీరా నందన్‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం అభినందించారు. క్రీడల్లో రాణించేలా అకీరాను ప్రోత్సహిస్తున్న మోహన్ దంపతులను ఆయన ప్రశంసించారు. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీలు మునిశేఖర్, వెంకన్న, శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, డీఎం హరి పాల్గొన్నారు.